హిడ్డెన్ టైగర్
ఈ క్రింది ఉన్న చిత్రంలో కనపడే పులి కాకా ఇంకో హిడ్డెన్ టైగర్ ఉంది . అది ఎక్కడో చెప్తారా !
బతుకమ్మ సంబరాలు
2:33 AM
rishi is back again.నిన్నటితో నా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి.ఈరోజునించి పది రోజుల పాటు నాకు హాలిడేస్. అందుకే మళ్ళి మిమ్మల్ని కలవడానికి వచ్చేసా.... ఈ హాలిడేస్ లో పెత్రమావాస్య, సద్దులు, దసరా పండగలను ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు కదా!
నిన్న సాయంత్రం అమ్మ తో కలిసి బజార్ కి వెళ్లి తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతజడ పూలు, బంతి పూలు, చామంతులు, గోరెంట పూలు, గుమ్మడి పూలు(గౌరమ్మ కొరకు) అన్ని తెచ్చాము.ఇవే కాకుండ రెండు డ్రెస్ లు కూడా తెచ్చుకున్నాను.ఈ రోజు ఉదయమే లేచి ఇంటి ముందు ముగ్గేసి,తలంటు స్నానం చేసి,అమ్మ తో కల్సి బతుకమ్మ తయారుచేసాను.మా ఇంట్లో బతుకమ్మను మీరు చూడండి...
ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమయిన ఈ బతుకమ్మ పండగను తొమ్మిది రోజుల పాటు సద్దుల వరకు రోజు సాయంత్రం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఏఏరొజు సాయంత్రం మా కాలనీ లో ఆడే బతుకమ్మ విశేషాలు,ఫోటోలతో మళ్లీ కలుస్తా.

కుక్క టుయ్యి ...టుయ్యి
11:40 AMఈ రోజు మా పక్కింటి ఆంటి, మా మమ్మీ తో వాళ్ళ కుక్క గురించి, చెబుతుంటే నేను విన్నానండి . అంతా విన్న తర్వాత నేను భలే నవ్వు కున్నా లెండి . ఇది చదివిన తర్వాత మీరు గ్యారంటీ గా నవ్వుతారు......ఇంతకూ అసలు సంగతేంటంటే....
ఆంటీ వాళ్ళింట్లో ఓ కుక్క ఉంది. అది ఈ మధ్య సరిగా ఏమి తింట లేదంట, ఆక్టివ్ గా ఉంట లేదంట. కారణం ఏంటంటే , మొన్నటి దాకా ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు హాస్టల్ కి వెళ్లి పోయారట, అప్పటినించి అది అలా మూడీ గా ఉంటుందట, ఇగ లాభం లేదని అంటీ కి ఒక ఉపాయం వచ్చేసి, వాళ్ళ పిల్లలతో మాట్లాడిస్తూ, సెల్ ఫోన్ ని తీసుకొచ్చి ఆ కుక్క చెవి దగ్గర పెట్టిందట.....అంతే వెంబడే ఆ కుక్క లేచి తోక ను టుయ్యి...టుయ్యి అంటూ ఉపుకుంటూ ( ఆంటీ ఇలానే చెప్పింది ..ఇక్కడొక స్మైలీ ) లేచి ఆక్టివ్ అయ్యిందట. తిండి కూడా తినేసిందట.. ఇదండీ కుక్క టుయ్యి ..టుయ్యి కథ. కుక్క విశ్వాసం గల జంతువు అని చదువుకున్నా కాని మరీ ఇంత విశ్వాసమని నాకు తెలీదు. ఇదండీ నా " కుక్క టుయ్యి....టుయ్యి స్టోరీ.
గోదావరిలో వినాయక నిమజ్జనం
7:31 AM
ఈ రోజు వినాయక నిమజ్జనం, మా ఉళ్లో గోదావరి లో ఎంతోమంది చాలా ఉత్సాహంగా నిమజ్జనం చేసారు. మీరు చూడండి ఈ నిమజ్జన దృశ్యాలు,
S.M.S
8:29 AM
"gud mrng" పొద్దున లేవగానే రవళి దగ్గర నుంచి ఒక మెసేజ్.
మళ్ళి కాసేపటికి తెలుగు ఎం చదవాలి? అని మరో మెసేజ్
S.M.S అంటే Short Message Service అట, దీంతో ఎన్ని తంటాలు అనుకుంటున్నారు!
వాళ్ళు ఫీల్ అవుతారని మనం ఫీల్ అయ్యి చివరకు దానికి ఎడిక్ట్ అవ్వాల్సివస్తుంది.
So, i decided not to become addict to this S.M.S. మరి మీరు?
మళ్ళి కాసేపటికి తెలుగు ఎం చదవాలి? అని మరో మెసేజ్
S.M.S లు ఫ్రెండ్స్ మధ్య టైంపాస్ మరియు ఫాస్టెస్ట్ కమ్యునికేషన్..
ఇది బానే ఉంది కాని మనం చదువుకునే సమయంలో, పడుకునేటప్పుడో, లేదా బిజిగా ఉన్నప్పుడో, మెసేజెస్ వస్తే మనకు వచ్చే ఇరిటేషన్ గురించి ఎం చెప్పమంటారు.మనం రెప్లై ఇచ్చే టైం ఉండదు, ఇవ్వక పోతేవాళ్ళు ఏమనుకుంటారో అని కచ్చితంగా రిప్లై ఇవ్వల్సివస్తుంది.
So, i decided not to become addict to this S.M.S. మరి మీరు?