కుక్క టుయ్యి ...టుయ్యి

ఈ రోజు మా పక్కింటి ఆంటి, మా మమ్మీ తో వాళ్ళ కుక్క గురించి, చెబుతుంటే  నేను విన్నానండి  . అంతా విన్న తర్వాత నేను భలే నవ్వు కున్నా లెండి .   ఇది చదివిన తర్వాత   మీరు గ్యారంటీ గా నవ్వుతారు......ఇంతకూ అసలు సంగతేంటంటే....

ఆంటీ వాళ్ళింట్లో ఓ కుక్క ఉంది.  అది ఈ మధ్య సరిగా ఏమి తింట లేదంట,  ఆక్టివ్ గా ఉంట లేదంట.   కారణం ఏంటంటే , మొన్నటి దాకా ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు హాస్టల్ కి వెళ్లి పోయారట,  అప్పటినించి అది అలా మూడీ గా ఉంటుందట,   ఇగ లాభం లేదని అంటీ కి ఒక ఉపాయం వచ్చేసి,  వాళ్ళ పిల్లలతో మాట్లాడిస్తూ, సెల్ ఫోన్ ని తీసుకొచ్చి ఆ కుక్క చెవి దగ్గర పెట్టిందట.....అంతే   వెంబడే ఆ కుక్క లేచి తోక ను టుయ్యి...టుయ్యి  అంటూ ఉపుకుంటూ ( ఆంటీ ఇలానే చెప్పింది ..ఇక్కడొక స్మైలీ ) లేచి  ఆక్టివ్ అయ్యిందట.  తిండి కూడా  తినేసిందట..    ఇదండీ కుక్క టుయ్యి  ..టుయ్యి  కథ.    కుక్క విశ్వాసం గల జంతువు అని చదువుకున్నా కాని మరీ ఇంత విశ్వాసమని నాకు తెలీదు.    ఇదండీ నా  " కుక్క టుయ్యి....టుయ్యి   స్టోరీ.    

గోదావరిలో వినాయక నిమజ్జనం

ఈ రోజు వినాయక నిమజ్జనం, మా ఉళ్లో గోదావరి లో ఎంతోమంది చాలా ఉత్సాహంగా నిమజ్జనం  చేసారు. మీరు చూడండి  ఈ నిమజ్జన దృశ్యాలు, 



మా కాలని లో గణపతి


మా ఉళ్లో సాయిబాబా గుడి


మా ఉళ్లో సాయిబాబా గుడికి మొన్నోసారి వెళ్ళాను.మీకోసం ఫోటోలు తీసాను.చూసి ఎలా ఉందో చెప్తారు కదూ!














































S.M.S

 "gud  mrng"   పొద్దున  లేవగానే రవళి దగ్గర నుంచి ఒక మెసేజ్. 
  
   మళ్ళి కాసేపటికి తెలుగు ఎం చదవాలి?  అని మరో మెసేజ్  
   
   S.M.S  అంటే Short Message Service అట, దీంతో ఎన్ని తంటాలు అనుకుంటున్నారు!

   S.M.S లు ఫ్రెండ్స్ మధ్య టైంపాస్ మరియు ఫాస్టెస్ట్  కమ్యునికేషన్..

ఇది బానే ఉంది కాని మనం చదువుకునే సమయంలో, పడుకునేటప్పుడో, లేదా బిజిగా ఉన్నప్పుడో,   మెసేజెస్ వస్తే మనకు వచ్చే ఇరిటేషన్ గురించి ఎం  చెప్పమంటారు.మనం రెప్లై ఇచ్చే టైం ఉండదు, ఇవ్వక పోతేవాళ్ళు  ఏమనుకుంటారో  అని కచ్చితంగా రిప్లై ఇవ్వల్సివస్తుంది.
  
 వాళ్ళు ఫీల్ అవుతారని మనం ఫీల్ అయ్యి చివరకు దానికి ఎడిక్ట్ అవ్వాల్సివస్తుంది.

 So, i decided not to become addict to this S.M.S. మరి మీరు? 

మా ఇంట్లో కృష్ణాష్టమి


మా ఇంట్లో కృష్ణాష్టమి రోజు మా అమ్మ చేసిన వన్ని  మీరు చూడండి...మీ ఇంట్లో కూడా చేసారా... నేనేమో స్కూల్ కి వెళ్ళ...నేను వచ్చే సరికే కృష్ణుడు వచ్చి వెళ్ళాడట...కాలనీ లో అందరి ఇండ్లకు వెళ్ళాలి కదా.......









































































మా కాలనీ లో పిల్లలంతా కలిసి నిన్న సాయంత్రం ఉట్టి కట్టి బాగా ఎంజాయ్ చేసారు. అవి కూడా చూడండి.