ఈ రోజు మా పక్కింటి ఆంటి, మా మమ్మీ తో వాళ్ళ కుక్క గురించి, చెబుతుంటే నేను విన్నానండి . అంతా విన్న తర్వాత నేను భలే నవ్వు కున్నా లెండి . ఇది చదివిన తర్వాత మీరు గ్యారంటీ గా నవ్వుతారు......ఇంతకూ అసలు సంగతేంటంటే....
ఆంటీ వాళ్ళింట్లో ఓ కుక్క ఉంది. అది ఈ మధ్య సరిగా ఏమి తింట లేదంట, ఆక్టివ్ గా ఉంట లేదంట. కారణం ఏంటంటే , మొన్నటి దాకా ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు హాస్టల్ కి వెళ్లి పోయారట, అప్పటినించి అది అలా మూడీ గా ఉంటుందట, ఇగ లాభం లేదని అంటీ కి ఒక ఉపాయం వచ్చేసి, వాళ్ళ పిల్లలతో మాట్లాడిస్తూ, సెల్ ఫోన్ ని తీసుకొచ్చి ఆ కుక్క చెవి దగ్గర పెట్టిందట.....అంతే వెంబడే ఆ కుక్క లేచి తోక ను టుయ్యి...టుయ్యి అంటూ ఉపుకుంటూ ( ఆంటీ ఇలానే చెప్పింది ..ఇక్కడొక స్మైలీ ) లేచి ఆక్టివ్ అయ్యిందట. తిండి కూడా తినేసిందట.. ఇదండీ కుక్క టుయ్యి ..టుయ్యి కథ. కుక్క విశ్వాసం గల జంతువు అని చదువుకున్నా కాని మరీ ఇంత విశ్వాసమని నాకు తెలీదు. ఇదండీ నా " కుక్క టుయ్యి....టుయ్యి స్టోరీ.
0 comments:
Post a Comment