కృష్ణం వందే జగద్గురు

వసు దేవ సుతం  
      దేవం  కంస 
చాణుర మర్దనం 
      దేవకీ
పరమానందం 
కృష్ణం వందే 
                                  జగద్గురుం 
అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చాల మంది ఈరోజు చేసుకుంటారు కదా ! మా ఇంట్లో రేపు లెండి. మా అమ్మ ఇంటి ముందు చిన్న చిన్న కృష్ణుని పాదాలు వేసి కృష్ణున్ని మా ఇంట్లో కి రమ్మని, ఏవేవో పిండి వంటలు చేస్తుంది.   వెన్న, అటుకులు కృష్ణుడికి  ఇష్టమని మా తాతయ్య చెప్పారు. ఈరోజు మా ఉళ్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటి పడి వాటిని కొడతారు.మీరు కూడా ఈ కృష్ణాష్టమి ని ఆనందంగా జరుపుకుంటారు కదూ. 

ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇక ఆన్లైన్ లో మాత్రమె



ఏదైనా ఇంగ్లీషు పదానికి అర్థం తెలియకపోతే మనకు వెంటనే 'ఆక్స్ఫర్డ్ డిక్షనరీ' గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న ఈ డిక్షనరీ పైనే ఆధారపడతం. దాదాపు శతాబ్ద కాలంగా పుస్తక రూపంలో ముద్రితమవుతున్న ఈ డిక్షనరీ ఇక నుంచి మాత్రం 'ఆన్లైన్' లోనే అందుబాటులో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం ప్రజలు ఆన్లైన్ వేర్శేన్ పైనే ఆధారపడుతుండడం, ప్రింట్ వేర్శేన్ కు గిరాకి బాగా తగ్గడం తో ఇక పై ముద్రణ మానేసి కేవలం ఆన్లైన్ లోనే ఈ డిక్షనరీని అందరికి అందుబాటులో కి తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటి  ప్రెస్ యోచిస్తుంది. ప్రతి నేలా ఇరవై లక్షలమంది ఈ డిక్షనరీ ఆన్లైన్ వేర్శేన్ ను సందర్శిస్తున్నారు అన్నట్లు ప్రచురణకర్తలు తెలిపారు. "ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆక్స్ఫర్డ్ డిక్ష్ణరీ కి  సవరణలు చేసి మరో ముద్రణ తీసుకురావడానికి మరికొన్నేల్లు పట్టవోచ్చు. ఈలోగా ప్రింట్ వేర్శేన్ కు మరింత గిరాకి పడిపోయే పరిస్థితి ఎర్పడవోచ్చు. ఒక వేల ప్రింట్ ఎడిషన్ ముద్రించాలనుకునే నాటికీ డిమాండ్ ఉంటె అప్పుడు మల్లి ముద్రించి మార్కెట్ లోకి తీసుకొస్తం. లేదంటే వేర్షేన్గానే దీనిని అందుబాటులోకి తీస్కోస్తం" అని ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటి ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ నిగెల్ పోర్ట్వుడ్ తెలిపారు.

లక్కీ ఫెలో

     ఒక పదేళ్ళ అబ్బాయి వీధి వెంట నడుచుకుంటూ వెళుతున్నాడు. గాలికి ఒక ఫోటో ఎగిరి వచ్చి అతని మొహం మీద పడింది. తీసి చూస్తే అదో అందమైన అమ్మాయి ఫోటో .లవ్ అట్ ఫస్ట్ సైట్.చూడగానే ప్రేమించేసాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో వెతికాడు. కాని దొరకలేదు. కాలం గడిచిపోయింది. అతను పెద్దల  కోసం పెళ్లి చేసుకున్నాడు.కానీ ఇంకా ఫోటోలోని అమ్మాయినే ఆరాదిస్తున్నాడు. తరచు ఫోటో తీసి చూసుకుంటూ ఉండేవాడు

      ఒక రోజు అతని భార్య కు ఆ ఫోటో దొరికింది. "ఈ ఫోటో ఎక్కడిది?.  అది నీ దగ్గరకు ఎలా వచ్చింది?" అని అడిగింది.

      "అది..... నాకు చిన్నపుడు రోడ్డు మీద దొరికింది. కానీ ఎందుకు నీకు?" అని అడిగాడతను."ఆ ఫోటో నాదే నా చిన్నపుడు పోగొట్టుకున్నాను"అంది భార్య.