ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇక ఆన్లైన్ లో మాత్రమె
6:44 PMఏదైనా ఇంగ్లీషు పదానికి అర్థం తెలియకపోతే మనకు వెంటనే 'ఆక్స్ఫర్డ్ డిక్షనరీ' గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్న, ఆఫీసులో ఉన్న ఈ డిక్షనరీ పైనే ఆధారపడతం. దాదాపు శతాబ్ద కాలంగా పుస్తక రూపంలో ముద్రితమవుతున్న ఈ డిక్షనరీ ఇక నుంచి మాత్రం 'ఆన్లైన్' లోనే అందుబాటులో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం ప్రజలు ఆన్లైన్ వేర్శేన్ పైనే ఆధారపడుతుండడం, ప్రింట్ వేర్శేన్ కు గిరాకి బాగా తగ్గడం తో ఇక పై ముద్రణ మానేసి కేవలం ఆన్లైన్ లోనే ఈ డిక్షనరీని అందరికి అందుబాటులో కి తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటి ప్రెస్ యోచిస్తుంది. ప్రతి నేలా ఇరవై లక్షలమంది ఈ డిక్షనరీ ఆన్లైన్ వేర్శేన్ ను సందర్శిస్తున్నారు అన్నట్లు ప్రచురణకర్తలు తెలిపారు. "ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆక్స్ఫర్డ్ డిక్ష్ణరీ కి సవరణలు చేసి మరో ముద్రణ తీసుకురావడానికి మరికొన్నేల్లు పట్టవోచ్చు. ఈలోగా ప్రింట్ వేర్శేన్ కు మరింత గిరాకి పడిపోయే పరిస్థితి ఎర్పడవోచ్చు. ఒక వేల ప్రింట్ ఎడిషన్ ముద్రించాలనుకునే నాటికీ డిమాండ్ ఉంటె అప్పుడు మల్లి ముద్రించి మార్కెట్ లోకి తీసుకొస్తం. లేదంటే వేర్షేన్గానే దీనిని అందుబాటులోకి తీస్కోస్తం" అని ఆక్స్ఫర్డ్ యూనివెర్సిటి ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ నిగెల్ పోర్ట్వుడ్ తెలిపారు.
0 comments:
Post a Comment