బతుకమ్మ సంబరాలు

rishi is back again.నిన్నటితో నా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి.ఈరోజునించి పది రోజుల పాటు నాకు హాలిడేస్. అందుకే మళ్ళి మిమ్మల్ని కలవడానికి వచ్చేసా.... ఈ హాలిడేస్ లో పెత్రమావాస్య, సద్దులు, దసరా పండగలను ఎంచక్కా ఎంజాయ్ చేయోచ్చు కదా!

 నిన్న సాయంత్రం అమ్మ తో కలిసి బజార్ కి వెళ్లి తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతజడ పూలు, బంతి పూలు, చామంతులు, గోరెంట పూలు, గుమ్మడి పూలు(గౌరమ్మ కొరకు) అన్ని తెచ్చాము.ఇవే కాకుండ రెండు డ్రెస్ లు కూడా తెచ్చుకున్నాను.ఈ రోజు ఉదయమే లేచి ఇంటి ముందు ముగ్గేసి,తలంటు స్నానం చేసి,అమ్మ తో కల్సి బతుకమ్మ తయారుచేసాను.మా ఇంట్లో బతుకమ్మను మీరు చూడండి...




 ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమయిన ఈ బతుకమ్మ పండగను  తొమ్మిది రోజుల పాటు సద్దుల వరకు రోజు సాయంత్రం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఏఏరొజు సాయంత్రం మా కాలనీ లో ఆడే బతుకమ్మ విశేషాలు,ఫోటోలతో మళ్లీ కలుస్తా.

1 comments:

Overwhelmed said...

chaa bagundi bathukamma.