ఒక పదేళ్ళ అబ్బాయి వీధి వెంట నడుచుకుంటూ వెళుతున్నాడు. గాలికి ఒక ఫోటో ఎగిరి వచ్చి అతని మొహం మీద పడింది. తీసి చూస్తే అదో అందమైన అమ్మాయి ఫోటో .లవ్ అట్ ఫస్ట్ సైట్.చూడగానే ప్రేమించేసాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో వెతికాడు. కాని దొరకలేదు. కాలం గడిచిపోయింది. అతను పెద్దల కోసం పెళ్లి చేసుకున్నాడు.కానీ ఇంకా ఫోటోలోని అమ్మాయినే ఆరాదిస్తున్నాడు. తరచు ఫోటో తీసి చూసుకుంటూ ఉండేవాడు
ఒక రోజు అతని భార్య కు ఆ ఫోటో దొరికింది. "ఈ ఫోటో ఎక్కడిది?. అది నీ దగ్గరకు ఎలా వచ్చింది?" అని అడిగింది.
"అది..... నాకు చిన్నపుడు రోడ్డు మీద దొరికింది. కానీ ఎందుకు నీకు?" అని అడిగాడతను."ఆ ఫోటో నాదే నా చిన్నపుడు పోగొట్టుకున్నాను"అంది భార్య.
3 comments:
verygud talli keep writing on
Why have you written this? what is the conclusion?
i left it to u all
Post a Comment